Breaking News

National Herald Case: ‘గాంధీ’లకు బిగుస్తున్న ఉచ్చు

Published on Sun, 11/30/2025 - 10:45

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) నేరపూరిత కుట్ర అభియోగాలు మోపింది. గాంధీలతో పాటు సామ్ పిట్రోడా, మరో ముగ్గురు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్‌), యంగ్ ఇండియన్ (వైఐ), డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేర్లను కూడా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లో చేర్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ అక్టోబర్ 3న రూపొందించారు. ఇందులో గాంధీలు దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఏజేఎల్‌ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

ఈ కేసు 2012 నాటిది. నాడు బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి స్థానిక కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్‌)ను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు మోసం, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని స్వామి ఆరోపించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఏజేఎల్‌ ప్రచురించేది. అయితే ఆర్థిక  ఇబ్బందుల కారణంగా 2008లో ముద్రణను నిలిపివేసింది. ఆ సమయంలో, మాతృ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్ల మేరకు బకాయి ఉంది.

కాంగ్రెస్ పార్టీ తెలిపిన వివరాల ప్రకారం ఏజేఎల్‌ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో, ఆ అప్పును ఈక్విటీ షేర్లుగా మార్చారు. పార్టీ ఈక్విటీ షేర్లను నిర్వహించలేని కారణంగా, వాటిని 2010లోయంగ్ ఇండియన్ (వైఐ)కి కేటాయించారు. ఈ యంగ్ ఇండియన్‌లో గాంధీ కుటుంబం 76 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన వాటాలను మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సామ్ పిట్రోడా, సుమన్ దూబే కలిగి ఉన్నారు. ఈ విధంగా యంగ్ ఇండియన్ ఏజెఎల్‌లో మెజారిటీ వాటాదారుగా మారింది.

ఈ లావాదేవీలో కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీ అయిన డోటెక్స్ మర్చండైజ్, యంగ్ ఇండియన్‌కు రూ. కోటి అందించింది. ఈ డబ్బులో యంగ్ ఇండియన్.. కాంగ్రెస్‌కు రూ. 50 లక్షలు మాత్రమే చెల్లించి, రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఏజేఎల్‌ నియంత్రణను పొందిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ కోర్టు ఈ కేసులో నిర్ణయం ప్రకటించడానికి డిసెంబర్ 16కి వాయిదా వేసింది. ఈ నేపధ్యంలోనే ఈ నేరపూరిత కుట్ర అభియోగాలతో కూడిన తాజా ఎఫ్‌ఐఆర్‌ వెలుగులోకి వచ్చింది. 

ఇది కూడా చదవండి: చాట్‌ జీపీటీకి మూడేళ్లు.. ఏం సాధించిందంటే..

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)