CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
మెట్రో ఆపగలరు.. పేపర్ లీక్ ఆపలేరు: రాహుల్ గాంధీ
Published on Sat, 07/25/2026 - 10:52
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న నీట్ అభ్యర్థుల నిరసనలు, పేపర్ లీక్ ఉదంతాలపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మెట్రో స్టేషన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు విధించడంతో పాటు 18 మెట్రో స్టేషన్లను మూసివేసింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. ‘మెట్రో బంద్ చేయండి, ఇంటర్నెట్ బంద్ చేయండి, దుకాణాలు బంద్ చేయండి.. కానీ ప్రధాని మోదీ మాత్రం పేపర్ లీక్ మాత్రం అడ్డుకోలేకపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు.
मेट्रो बंद करो।
रास्ते बंद करो।
दुकानें बंद करो।
Internet बंद करो।
खाना बंद करो।
अपना हक़ मांग रहे छात्रों के ख़िलाफ़ सरकार ने ये क्रूर कदम उठाए।
बस एक चीज़ बंद नहीं कर पाए, मोदी जी - पेपर लीक।— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపించారు. జాతీయ జెండాలు పట్టుకుని నిరసన తెలుపుతున్న యువకులపై పోలీసులు పెల్లెట్ గన్లు ప్రయోగించారని, లాఠీచార్జీ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ పతనానికి ఆయనే ప్రధాన కారణమని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం, వారిపై అణచివేత చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఇది కూడా చదవండి: యువతకు సమాధానం ఇవ్వాల్సిందే: మోహన్ భగవత్
Tags : 1