Breaking News

మీరూ టీచరేగా.. దయచేసి జోక్యం చేసుకోండి

Published on Tue, 04/08/2025 - 15:49

న్యూఢిల్లీ: బెంగాల్‌ టీచర్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. ఏ తప్పూ చేయని టీచర్లకు న్యాయం జరిగేలా చూడాలని కోరారాయన. 2016 టీచర్‌ రిక్రూట్‌మెంట్‌లో భారీ మోసం జరిగిందంటూ 25 వేల నియామకాలను ఇటు కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. అటు సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది.  అయితే.. 

నియామకాల సమయంలో జరిగిన నేరాలు ఖండించదగ్గవే అయినప్పటికీ.. ఏ తప్పూ చేయనివాళ్ల ఉద్యోగాలు పోవడం తీవ్ర అన్యాయం కిందకు వస్తుందని రాహుల్‌ గాంధీ అంటున్నారు. ఏ తప్పు చేయకుండా చట్టపరంగా ఉద్యోగాలు పొందిన వాళ్లు సైతం నష్టపోవడం ఇక్కడ బాధాకరం.    దాదాపుగా దశాబ్దంపాటుగా విధులు నిర్వహిస్తున్న ఈ కళంకం లేని టీచర్లను తొలగించడం.. విద్యా వ్యవస్థకు ఆటంకం కలిగించడమే అవుతుంది. అంతేకాదు.. వాళ్ల కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాయి.

గతంలో మీరూ ఓ టీచరే కదా. కాబట్టి.. ఈ మానవతప్పిదం కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఏ మోసానికి, తప్పునకు పాల్పడకుండా ఉద్యోగాలు సాధించిన వాళ్లను.. తిరిగి కొనసాగించేలా ప్రభుత్వాన్ని కొరతారని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అని లేఖలో రాష్ట్రపతి ముర్మును రాహుల్‌ గాంధీ కోరారు. ఈ లేఖను తన ఎక్స్‌ ఖాతాలోనూ పోస్ట్‌ చేశారాయన. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)