Breaking News

నిరుద్యోగులకు రూ.3,000

Published on Tue, 03/21/2023 - 05:29

బనశంకరి: కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.3,000, డిప్లొమా చేసిన వారికి రూ.1,500 నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ‘‘యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలిస్తాం. 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీచేస్తాం’ అని హామీ ఇచ్చారు. సోమవారం బెళగావిలో ‘యువక్రాంతి’ బహిరంగ సభ ఆయన ప్రసంగించారు. కర్ణాటకలో పాలక బీజేపీని కాంగ్రెస్‌ నేతలు ఐక్యమత్యంతో కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు.

‘‘బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమిషన్లు మరిగింది. దేశంలో అత్యంత అవినీతిమయ సర్కార్‌’’ అని ఆరోపించారు. ‘‘దేశం ఒకరిద్దరి సొత్తు కాదు. అదానీలది అస్సలు కాదు. కానీ బీజేపీ స్నేహితులైన కొద్దిమందికే సర్వం దక్కుతున్నాయి. ఇది అవినీతికి దారితీస్తుంది’’ అని రాహుల్‌ ఆరోపించారు. గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళ ఇంటిపెద్దగా ఉన్న కుటుంబానికి నెలకు రూ.2,000 ఆర్థికసాయం, దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతీ సభ్యుడికి నెలకు 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్‌ ఇప్పటికే మూడు హామీలు ప్రకటించింది. సోమవారం నాలుగో హామీ ఇచ్చింది.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)