కేరళలో ప్రకృతి విపత్తు : వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక

Published on Thu, 08/01/2024 - 16:38

తిరువనంతపురం : కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్ర గురువారం (ఆగస్ట్‌1) కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో చూరల్‌మల ప్రాంతాన్ని సందర్శించారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన స్థానికుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

భారీ వర్షాల కారణంగా మంగళవారం వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 256 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో కేరళ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ సుమారు 1,000 మందిని రక్షించింది . 220 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వయనాడ్‌ వరదల నుంచి ప్రజల నుంచి భద్రతా బలగాలు చేస్తున్న సహాయక చర్యలు గురువారానికి మూడోరోజుకి చేరుకున్నాయి.  

హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్‌ఎడిఆర్) ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం కనీసం 1,500 మంది ఆర్మీ సిబ్బందిని, ఫోరెన్సిక్ సర్జన్లను నియమించామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

రానున్న రెండు రోజుల్లో వయనాడ్‌తో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)