Breaking News

మణిపూర్‌ సమస్యను కామెడీగా మార్చేస్తారా?

Published on Sun, 08/13/2023 - 05:34

వయనాడ్‌: మణిపూర్‌ హింసాకాండ వంటి అతి తీవ్రమైన సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ నవ్వులాటగా మార్చేశారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. వయనాడ్‌ ఎంపీ అయిన ఆయన అనర్హత వేటు తొలగాక శనివారం తొలిసారి కేరళలో పర్యటించారు. కాల్పెట్టలో యూడీఎఫ్‌ బహిరంగ సభలో మాట్లాడారు. మణిపూర్‌ సమస్యను విపక్షాలు పార్లమెంటు దాకా తీసుకెళ్లి చర్చకు పెట్టినా దానిపై మాట్లాడటానికి కూడా మోదీ ఇష్టపడలేదని ఆరోపించారు.

‘అవిశ్వాస తీర్మానంపై చర్చకు బదులిస్తూ మోదీ 2 గంటల 13 నిమిషాల సేపు ప్రసంగించారు. అందులో ఏకంగా 2 గంటల పాటు కాంగ్రెస్‌ గురించి, నా గురించి, విపక్ష ఇండియా కూటమి గురించి... ఇలా అన్నింటి గురించీ మాట్లాడారు. అంతసేపూ మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అన్నింటి మీదా జోకులు వేశారు. నవ్వుకున్నారు. కానీ అసలు సమస్య మణిపూర్‌ హింసాకాండ గురించి మాట్లాడేందుకు మాత్రం మోదీ కేటాయించింది కేవలం రెండంటే రెండే నిమిషాలు! భారత్‌ అనే భావనకే మణిపూర్‌లో తూట్లు పొడిచారు‘ అని మండిపడ్డారు.  భారత్‌ అనే భావనకే తూట్లు పొడిచే వాళ్లు జాతీయవాదులు ఎలా అవుతారని రాహుల్‌ ప్రశ్నించారు.

మణిపురీల దుస్థితి చూసి.. చలించిపోయా
మణిపూర్‌ పర్యటన సందర్భంగా అక్కడి బాధితుల దుస్థితి చూసి ఆపాదమస్తకం చలించిపోయానని రాహుల్‌ గుర్తు చేసుకున్నారు. తన 19 ఏళ్ల రాజకీయ జీవితంలో అంతటి దారుణ పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీయే తన స్వార్థ ప్రయోజనాల కోసం మణిపూర్‌ ప్రజల మధ్య నిలువునా చీలిక తెచి్చందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కనీసం ఐదేళ్లయినా పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘ పునరావాస కేంద్రాల్లో ఒక మహిళ చెప్పింది విని కన్నీరు పెట్టా. కొడుకును ఆమె కళ్ల ముందే చంపారు.

మిగతా అందరూ కుటుంబాలతో ఉంటే ఆమె మాత్రం ఒంటరిగా పడుకుని కనిపించింది. మీ వాళ్లెక్కడ అని అడిగితే ఎవరూ మిగల్లేదంటూ ఏడ్చేసింది. తన పక్కన పడుకున్న కొడుకును కళ్ల ముందే కాల్చేస్తే రాత్రంతా శవం పక్కనే గడిపానని గుర్తు చేసుకుంది. తనెలాగూ తిరిగి రాడని గుండె రాయి చేసుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పింది. ఆ ఘోర కలి గురించి చెప్తూ కూడా వణికిపోయింది. ఇంకో బాధిత మహిళ తనకు జరిగిన దారుణాలను తలచుకున్నంత మాత్రాన్నే స్పృహ తప్పి పడిపోయింది. మణిపూర్‌లో ఇలాంటి దారుణ గాథలు వేలాదిగా ఉన్నాయి. నా తల్లికి, చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకున్నా‘ అన్నారు. 

Videos

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)