Breaking News

రాహుల్‌ గాంధీకి యూపీ కోర్టు సమన్లు.. జూలై 2న హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశం

Published on Wed, 06/26/2024 - 20:30

ల‌క్నో: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌జాప్ర్తినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసులో దాఖ‌లైన పిటిష‌న్‌పై  జూలై 2న తమ ఎదుట హాజరుకావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్‌ గాంధీని కోరింది. కేసు తదుపరి విచారణ జూలై 2న జర‌గ‌నుంది.

వివ‌రాలు.. జూలై 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సుల్తాన్‌పూర్‌ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌, బీజేపీ నేత విజయ్‌ మిశ్రా ఆగస్టు 4, 2018లో రాహుల్‌ గాంధీపై పరువునష్టం కేసు వేశారు.

2018తో పాటు గతేడాది నవంబర్‌ 27న కోర్టు కాంగ్రెస్‌ నేతను విచారణకు పిలిచింది. ఏడాది ఫిబ్రవరి 20న రాహుల్‌ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్‌ను పొందారు. అయితే, అప్పటి నుంచి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.

ఇదిలా ఉండ‌గా.. ఈ నెల 7న కొత్వాలి నగర్‌కు చెందిన రామ్‌ ప్రతాప్‌ అనే వ్యక్తి ఈ కేసులో తనను పార్టీగా మార్చాలని కోర్టును కోరారు. దీనిని బీజేపీ నేత విజయ్‌ మిశ్రా తరఫు న్యాయవాది సంతోష్‌ పాండే వ్యతిరేకించారు. కేసును జాప్యం చేసేందుకు పిటిషన్‌ దాఖలు చేశారని ఆరోపించారు. అనంత‌రం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రాహుల్‌ గాంధీ వ్య‌క్తిగ‌తంగా హ‌జ‌రు కావాల‌ని కోర్టు ఆదేశిసస్తూ స‌మ‌న్లు జారీ చేసింది. విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేసింది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)