Breaking News

మిమ్మల్ని వదిలేది లేదు 

Published on Fri, 07/25/2025 - 04:02

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలోని ఓ నియోజకవర్గంలో మోసం జరిగిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తామనుకోవద్దు..మేం మిమ్మల్ని వదిలిపెట్టం అంటూ ఆయన చేసిన హెచ్చరికలపై ఎన్నికల కమిషన్‌(ఈసీ) తీవ్రంగా స్పందించింది. రాహుల్‌ గురువారం పార్లమెంట్‌ వెలుపల మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన..‘భారత ఎన్నికల సంఘం తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. గతేడాది కర్నాటకలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఒక్కో నియోజకవర్గాన్ని పరిశీలిస్తూ వస్తున్నాం. ఒక నియోజకవర్గంలో తప్పు జరిగినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. 90 శాతం కాదు..100శాతం మోసం జరిగినట్లు రుజువులున్నాయి. అక్కడంతా డ్రామా నడిచింది. దీనిపై ఈసీకి మెసేజీ పంపుతా. 

ఈ విషయం ఇంతటితో ముగిసిందని ఈసీ, అధికారులు అనుకోవద్దు. మీరు తప్పు చేశారు. ఎక్కడికీ వెళ్లలేరు. మిమ్మల్ని వెంటాడుతాం’అని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఎన్నికలైన ఏడాది తర్వాత రాజ్యాంగ సంస్థపై నిరాధార బెదిరింపు ఆరోపణలు చేయడం తగదని పేర్కొంది. ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్‌ 80 ప్రకారం హైకోర్టులో పిటిషన్‌ వేయకుండా ఇటువంటి విమర్శలు చేయడం దురదృష్టకరమంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా నమోదవలేదని ఈసీ తెలిపింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)