Breaking News

మేకిన్‌ ఇండియాతో చైనాకే లాభం.. మనకు నష్టం

Published on Sun, 06/22/2025 - 05:38

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో చేపట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’తో మన దేశానికి ఎలాంటి లా­భం లేకపోగా చైనాయే ఎక్కువగా లాభ­పడిందని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. 2014 తర్వాత భారత్‌లో తయా­రీ రంగం జీడీపీలో 14 శాతానికి పడిపోవడం, చైనా నుంచి దిగుమతులు రెట్టింపు కావడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నినాదాలు ఇవ్వడంలో మాస్టర్‌ అని.. పరిష్కారాలు చూపడంలో కాదని రాహుల్‌ ఎద్దేవా చేశారు. 

శనివారం రాహుల్‌ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా పరిశ్రమల బూమ్‌కి మోదీ సర్కార్‌ హామీ ఇచి్చంది. అయితే తయారీరంగం ఎందుకు చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారింది? యువత అత్యధిక స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోంది. చైనా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. నినాదాలు ఇచ్చే కళలో మోదీ విపరీతమైన నైపుణ్యం సాధించారు. కానీ పరిష్కారాలు చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు’’అని రాహుల్‌ విమర్శించారు.  

అంతా అసెంబ్లింగ్‌ 
ఢిల్లీలో ప్రముఖమైన ఎల్రక్టానిక్స్‌ విక్రయ దుకాణ సముదాయం అయిన నెహ్రూ ప్లేస్‌ను రాహుల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మొబైల్‌ రిపేర్‌ టెక్నీషియన్స్‌ అయిన సైఫ్, శివమ్‌లతో కొద్దిసేపు మాట్లాడారు. సంబంధిత వీడియోనూ ‘ఎక్స్‌’లో రాహుల్‌ షేర్‌చేశారు. ‘‘‘నిజం ఏంటంటే.. ఇతర దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నాం. వాటికి బిగించే అసెంబ్లింగ్‌ పనిచేస్తున్నాం. అంతేగానీ ఇక్కడ ఉత్పత్తిచేయట్లేము. అందుకే మన కారణంగా చైనా లాభపడుతోంది. 

చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్రక్టానిక్‌ మార్కెట్‌గా వెలుగొందుతోంది. ఇంతపెద్ద మార్కెట్‌ మరేచోటా లేదు. మనం ఐఫోన్‌ విడిభాగాలను దిగుమతిచేసుకుని అసెంబ్లింగ్‌ చేస్తున్నాం. ఇది అతికొద్ది మంది పారిశ్రామికవేత్తల కనుసన్నల్లో జరుగుతోంది. ఇకపై మనమే ఐఫోన్లను తయారుచేసే స్థాయికి ఎదుగుదాం. అప్పుడే ఈ పరిశ్రమ పురోగతి సాధిస్తుంది. ఇతర దేశాల వస్తువులకు భారత్‌ అనేది మార్కెట్‌గా ఉండకూడదు.

 స్థానికంగా ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేసే మార్కెట్‌గా భారత్‌ అవతరించాలి. ఇందుకోసం ప్రాథమికస్థాయిలోనే సంస్కరణలు రావాలి. లక్షల కొద్దీ తయారీదారులు తయారుకావాలి. ఇందుకు ఎంతో నిజాయతీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక దన్ను అవసరం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(పీఎల్‌ఐ) ప్రయోజనాలనూ ప్రభుత్వం గుట్టుచప్పుడుకాకుండా నెమ్మదిగా ఉపసంహరించుకుంటోంది. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే’అని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. 

విమర్శించిన బీజేపీ 
రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ‘‘దేశంలో భారీ సంస్కరణలు, దేశ పురోగతిని అందరూ కళ్లారా చూస్తున్నారు ఒక్క రాహుల్‌ తప్ప. దేశ ప్రగతిని తక్కువ అంచనా వేయంలో రాహుల్‌ బిజీగా మారారు. భారత స్వావలంభనకు ఆపరేషన్‌ సిందూర్‌ తాజా తార్కాణం. చైనా తయారీ డ్రోన్లను భారత తయారీ డ్రోన్లు నేలకూల్చాయి’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ అన్నారు.
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)