Breaking News

‘ఎంఎస్పీకి చట్టపరమైన హోదా కల్పిస్తాం’: రాహుల్‌ గాంధీ

Published on Thu, 03/14/2024 - 21:34

ఢిల్లీ:లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీల విషయంలో వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే యువత కోసం ‘యువ న్యాయ్‌’ పేరుతో హామీలు, ‘నారీ న్యాయ్‌’ పేరుతో మహిళలకు ఎన్నికల హామీలను ప్రకటించింది కాంగ్రెస్‌. తాజాగా బుధవారం రైతుల కోసం ‘కిసాన్‌ న్యాయ్‌’ పేరుతో ఐదు హామీలను ప్రకటించింది.

ఇవే ఆ ఐదు హామీలు...

  • స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎంఎస్పీకి చట్టపరమైన హోదా కల్పిస్తాం.
  • రైతుల రుణాలను మాఫీ చేయడానికి,  రుణమాఫీ మొత్తాన్ని నిర్ణయించడానికి శాశ్వత ‘వ్యవసాయ రుణ మాఫీ కమిషన్’ ఏర్పాటు చేస్తాం.
  • బీమా పథకాన్ని మార్చడం ద్వారా పంట నష్టం జరిగితే 30 రోజులలోపు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తాం.
  • రైతుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త దిగుమతి, ఎగుమతి విధానాన్ని రూపొందిస్తాం.
  • వ్యవసాయ వస్తువులను జీఎస్టీని తొలగించడం ద్వారా రైతులను జీఎస్టీ రహితంగా తీర్చిదిద్దుతాం. 

‘దేశంలోని అన్నదాతలకు నా సెల్యూట్‌!. మీ సమస్యలను కూకటివేళ్లతో నిర్మూలించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఐదు హామీలను ఇస్తోంది. చెమటతో దేశంలోని నేలను పచ్చదనంతో నింపే రైతుల జీవితాలను ఆనందంగా మార్చడమే కాంగ్రెస్‌ లక్ష్యం. అందుకే ఈ ఐదు చారిత్రాత్మాక హామీల దిశగా అడుగులు వేస్తున్నాం’ అని రాహుల్‌ గాంధీ ఐదు హామీలను ‘ఎక్స్’ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

చదవండి:  పేద మహిళలకు ఏటా రూ. లక్ష


పంటలకు కనీస మద్దుతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించటంతో పాటు ఇతర డిమాండ్ల సాధనకు దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో అ‍న్నదాతలు  ‘చలో ఢిల్లీ’ పేరుతోల నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికీ రైతులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రైతులకు డిమాండ్లకు పెద్దపీట వేస్తూ ఐదు హామీలను ప్రకటించటం గమనార్హం.

చదవండి:  రాహుల్‌ ‘యువ న్యాయ్‌’

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)