Breaking News

Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు

Published on Sun, 05/19/2024 - 06:03

న్యూఢిల్లీ: సన్నిహితులైన వ్యాపారవేత్తలతో ఉన్న లింకులపై ప్రశ్నలకు, ఎలక్టోరల్‌ బాండ్లను దురి్వనియోగం చేయడంపై సమాధానాలు చెప్పుకోలేరు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చర్చకు ముందుకు రావడం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆప్‌ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ సీట్లలో కూటమిని గెలిపించాలని పిలుపిచ్చారు. 

ఆసక్తికరమైన విషయమేమింటే నేను ఆప్‌కు ఓటేస్తాను, కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌కు ఓటేస్తారని రాహుల్‌ అన్నారు. ప్రధాని మోదీ తన అనుకూల పాత్రికేయులకు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ తనతో చర్చకు మాత్రం రారని, ఎందుకంటే తన ప్రశ్నలకు సమాధానమివ్వలేనని మోదీకి తెలుసన్నారు. అదానీ– అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ డబ్బు ముట్టిందని ప్రధాని ఆరోపిస్తారు.. కానీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం మాత్రం చేయరు అని ఎద్దేవా చేశారు. 

‘ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రధాని మోదీతో చర్చకు నేను సిద్ధమే. ఆయన రారని నాకు తెలుసు. ఆయన్ను నేనడిగే తొలి ప్రశ్న.. అదానీతో మీకున్న బంధుత్వమేమిటి? రెండో ప్రశ్న... బీజేపీకి అందిన ఎలక్టోరల్‌ బాండ్ల గురించి’ అని రాహుల్‌ వివరించారు. మోదీ, రాహుల్‌లు చర్చ చేయాలని ఇద్దరు మాజీ జడ్జిలు, మాజీ సంపాదకుడు ఎన్‌.రామ్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే.  ఈడీæ అధికారులు అలసిపోయే దాకా 55 గంటల పాటు వారు నన్ను ఇంటరాగేట్‌ చేసేలా బీజేపీ చేసింది. నా ఇంటిని (ఎంపీ క్వార్టర్‌ను) లాగేసుకున్నారు. నాకు మీ క్వార్టర్‌ అవసరం లేదని.. మొత్తం దేశమే నా ఇల్లని వారికి చెప్పానని రాహుల్‌ బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీలో చేరుతున్న వారిపై మాట్లాడుతూ.. తమకేమీ ఇబ్బంది లేదని, పిరికిపందలు తమకు అక్కర్లేదని చెప్పారు. సీబీఐ, ఈడీ దాడులను భయపడి లొంగిపోయే వారు తమకు అవసరం లేదన్నారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)