Breaking News

పూరీ రథయాత్ర: రాష్ట్రపతి ముర్ము, ‍ప్రధాని మోదీ శుభాకాంక్షలు

Published on Thu, 07/16/2026 - 09:49

పూరీ: ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. రథయాత్రలోని సంప్రదాయాలు వినయం, సమిష్టి భాగస్వామ్యం, నిస్వార్థ సేవలను ప్రతిబింబిస్తాయని, ఇవి తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని, సమాజంలో ఐక్యతా స్ఫూర్తి పెంపొందాలని మహాప్రభు జగన్నాథుడిని ఆయన ప్రార్థించారు.
 

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తజన సమూహానికి, దైవానికి మధ్య జరిగే ఈ కలయిక అద్వితీయమని ఆమె అభివర్ణించారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి రథాలపై ఊరేగింపుగా వచ్చి భక్తులకు దర్శనమివ్వడం అత్యంత పవిత్రమైన ఘట్టమని పేర్కొన్నారు.

మరోవైపు రథయాత్ర నేపథ్యంలో పూరీ నగరం భారీ భద్రతా వలయంలోకి వెళ్లింది. సింహద్వారం వద్ద నందిఘోష, దర్పదలన, తాళధ్వజ రథాలు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 13 వేల మంది పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ దళాలు, ఎన్ఎస్‌జీ కమాండోలు, తీర రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో నిఘాను ముమ్మరం చేశారు. భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ 300 ప్రత్యేక రైళ్లను, రవాణా శాఖ 800 బస్సులను అందుబాటులోకి తెచ్చింది.

ఇది కూడా చదవండి: రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)