Breaking News

Punjab: సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులకు అల్టీమేటం జారీ చేసిన సీఎం మాన్‌

Published on Wed, 01/11/2023 - 15:46

పంజాబ్‌లో సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. అవినీతి ఆరోపణల కారణంగా లూథియానాలోని ప్రాంతీయ రవాణాశాఖ అధికారి నరీందర్‌ సింగ్‌ ధాలివాల్‌ను స్టేట్‌ విజిలెన్స్‌ బ్యూరో గత శుక్రవారం అరెస్ట్‌ చేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చలాన్లు జారీ చేయకుండా వాహనాదారుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణంతో అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్‌ బ్యూరో అధికారులు తెలిపారు.

అయితే తమ సహోద్యోగిని అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారంటూ సివిల్‌​ సర్వీస్‌ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ విధులు బహిష‍్కరించారు. అయిదు రోజులపాటు సామూహికంగా సాధారణ సెలవులపై వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పనులు ఆగిపోయాయి. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన సివిల్‌ సర్వీసెస్‌ అధికారులపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా నిరసనలను బ్లాక్‌మెయిల్‌గా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మె విరమించి బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తిరిగి విధుల్లో చేరాలని, లేకుంటే వారిని సస్పెండ్‌ చేస్తామని  హుకూం జారీ చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్‌ చేశారు.

‘కొందరు అధికారులు సమ్మె ముసుగులో విధులకు హాజరుకావడం లేదని నా దృష్టికి వచ్చింది. అవినీతి అధికారులపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు వ్యతిరేకంగా వారు నిరసన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాంటి సమ్మె బ్లాక్‌మెయిలింగ్, పని చేయకుండా చేతులు దులుపుకోవడమే అవుతుంది. బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమూ దీనిని సహించదు. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విధుల్లో చేరని  అధికారులందరినీ సస్పెండ్ చేయండి’ అని భగవంత్‌ మన్ పేర్కొన్నారు.

అయితే, సీఎం హెచ్చరికను కూడా ఉద్యోగులు పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. భగవంత్‌ మాన్‌ విధించిన డెడ్‌లైన్‌ ముగిసినప్పటికీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరలేదు. దీంతో అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఉత్కంఠగా మారింది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)