టక్‌ చేయలేదని చితక్కొట్టిన టీచర్‌

Published on Mon, 10/07/2024 - 09:38

టక్‌ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్‌పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు.

 నిర్లక్ష్యంగా సమాధానమిచి్చన టీచర్‌ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్‌ సబ్జెక్ట్‌ బోధించే సందేశ్‌ బోసాలే సెప్టెంబర్‌ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్‌ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. 

వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్‌ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్‌ను చితకబాదారు.      

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)