Breaking News

పుణే ఘటనలో అదిరిపోయే ట్విస్ట్‌

Published on Sat, 06/01/2024 - 11:01

ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఇద్దరి మృతికి కారణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ.. రోజుకొక అరెస్ట్‌తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టీనేజర్‌ను తప్పించేందుకు అతని కుటుంబం చేసిన ప్రయత్నాలు విస్తుగొల్పుతున్నాయి. తాజాగా ఈ కేసులో టీనేజర్‌ తల్లిని కూడా అరెస్ట్‌ చేశారు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. 

విచారణ కోసం పిలిచిన ఆమెను.. శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు పోలీసులు. బ్లడ్ టెస్ట్ సమయంలో నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చినందుకే ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు. ప్రమాదం సమయంలో తన కుమారుడు తాగలేదని నిరూపించేందుకు ఆమె  తన రక్తనమూనాలు ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. 

ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని..  నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు భారీ నగదుతో డీల్‌ కుదిరిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే టీనేజర్ తల్లి శాంపిళ్లను బ్లడ్‌ టెస్ట్‌కు ఇచ్చినట్లు తేలింది. రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకోవడం గమనార్హం. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చిన ఆరోపణలపై ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. 

పుణే పోర్షే కారు కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, తాత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును తనమీద వేసుకోమని తమ డ్రైవర్‌ను ఒప్పించేందుకు యత్నించారని, అతడు అంగీకరించకపోవడంతో కిడ్నాప్‌ చేసి ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమయ్యాయి. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ కుటుంబం పలువురు అధికారుల్ని ప్రలోభపెట్టేందుకు యత్నించడమూ దర్యాప్తులో వెలుగు చూసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)