Breaking News

దభోల్కర్‌ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు

Published on Sat, 05/11/2024 - 05:53

పుణె: అంధవిశ్వాసాలను రూపుమాపేందుకు మహారాష్ట్రలో సామాజిక ఉద్యమం చేసిన హేతువాది డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌ హత్యోదంతంలో ఇద్దరు నిందితులకు పుణె ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దభోల్కర్‌ హత్య జరిగిన 11 సంవత్సరాలకు తీర్పు వెలువడటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. 

ఈ హత్యలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వీరేంద్రసిన్హా తావ్డేకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటిస్తూ అదనపు సెషన్స్‌ జడ్జి తీర్పు చెప్పారు. షూటర్లు సచిన్‌ అంధూరే, శరద్‌ కలాస్కర్‌లకు జీవితఖైదుతోపాటు చెరో రూ.5 లక్షల జరిమాన విధించారు. సరైన సాక్ష్యాలు లేని కారణంగా తావ్డే, సంజీవ్, విక్రమ్‌ను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 67 ఏళ్ల దభోల్కర్‌ 2013 ఆగస్ట్‌ 20న పుణెలో ఉదయపు నడకకు వెళ్లినపుడు బైక్‌పై వచి్చన ఆగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలైన దభోల్కర్‌ ఆస్పత్రిలో చనిపోయారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)