Breaking News

పూణే అత్యాచార కేసు.. నిందితుడు రామ్‌దాస్‌ అరెస్ట్‌

Published on Fri, 02/28/2025 - 07:43

పూణే: మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్‌ రామ్‌దాస్‌ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్‌గేటు బస్టాండ్‌ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్‌ రామ్‌దాస్‌ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్‌దాస్‌ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్‌ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అ‍త్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.

 

జరిగింది ఇదీ..
పూణేలో అత్యంత రద్దీగా ఉండే బస్‌ స్టేషన్‌లలో ఒకటైన స్వర్‌గేట్‌లో మంగళవారం ఉదయం అత్యాచార చోటు చేసుకుంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్‌ స్టేషన్‌లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్‌ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.

బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్‌ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్‌ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)