Breaking News

పూజా ఖేడ్కర్‌ తండ్రి వీరంగం.. భారీ నష్టపరిహారం కోసమే ట్రక్కు హెల్పర్‌ కిడ్నాప్‌

Published on Tue, 09/16/2025 - 08:24

ముంబై: సప్పెండ్‌ అయిన ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ వీరంగం సృష్టించారు. తన అసిస్టెంట్‌ సాయంతో ఒక ట్రక్కు హెల్పర్‌ను కిడ్నాప్‌ చేశాడు. తమ రెండు కోట్ల ఖరీదైన ఎస్‌యూవీ వాహనాన్ని ట్రక్కుతో ఢీకొని, అది డ్యామేజ్‌ అయ్యేందుకు కారణంగా నిలిచిన ట్రక్కు హెల్పర్‌ను భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ, దిలీప్ ఖేడ్కర్ అతనిని కిడ్నాప్‌ చేశాడని పోలీసులు తెలిపారు.

ట్రక్కు హెల్పర్‌ కిడ్నాప్‌ కేసు విచారణకు పోలీస్‌స్టేష్టన్‌కు వస్తామని చెప్పిన పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్, తల్లి మనోరమ ఆ తరువాత పరారయ్యారని పోలీసులు తెలిపారు.  ట్రక్కు హెల్పర్‌ ప్రహ్లాద్ కుమార్‌(22)ను దిలీప్ ఖేడ్కర్ ఇంటి నుంచి రక్షించేందుకు వెళ్లిన పోలీసు బృందంపై మనోరమ ఖేడ్కర్ కుక్కలను  ఉసిగొల్పింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు.

నవీ ముంబైలోని ఐరోలి వద్ద దిలీప్‌ ఖేడ్కర్,  అతని అంగరక్షకుడు ప్రఫుల్ సలుంఖే ప్రయాణిస్తున్న అత్యంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్‌ను సిమెంట్ మిక్సర్ ఢీకొట్టింది. ఈ నేపధ్యంలో ట్రక్కు హెల్పర్‌ ప్రహ్లాద్ కుమార్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని దిలీప్‌ ఖేడ్కర్ పూణేలోని చతుర్శృంగిలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రహ్లాద్ కుమార్‌పై దాడి చేశారనే ఆరోపణలున్నాయి. ‘ప్రమాదం జరిగినప్పుడు దిలీప్ ఖేద్కర్, అతని అంగరక్షకుడు కారులో ఉన్నారు. కారుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ వారు ట్రక్కు సహాయకుడిని కిడ్నాప్ చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ దహనే మీడియాకు తెలిపారు.

ప్రహ్లాద్ కుమార్‌ కనిపించడం లేదంటూ ట్రక్కు యజమాని తమకు ఫిర్యాదు చేశారని, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా పోలీసులు ఖేద్కర్ ఇంటికి చేరుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అక్కడ మనోరమ ఖేద్కర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని. వారి ఇంటి గోడకు అతికించిన నోటీసును కూడా చింపివేశారని పేర్కొన్నారు. దిలీప్ ఖేడ్కర్ దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)