Breaking News

నేను చిప్స్‌  దొంగిలించలేదమ్మా 

Published on Sat, 05/24/2025 - 04:07

కోల్‌కతా: పాపం 12 ఏళ్ల పసివాడు! చిప్స్‌ దొంగిలించాడని అభాండం వేయడమే గాక అందరిముందు దండించడాన్ని, తల్లి కూడా తననే తప్పుబట్టడాన్ని తట్టుకోలేకపోయాడు. ఏకంగా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ‘నేను చిప్స్‌ దొంగిలించలేదమ్మా’ అంటూ నోట్‌ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు! ఈ దారుణం పశ్చిమబంగాల్‌లో పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాలోని పన్‌స్కురాలో జరిగింది. 

ఏడో తరగతి చదువుతున్న క్రిషేందు దాస్‌ చిప్స్‌ ప్యాకెట్‌ కొనడానికి ఓ దుకాణానికి వెళ్తే ఎవరూ కన్పించలేదు. ‘మామయ్య! చిప్స్‌ కావాలి’ అని యజమాని శుభాంకర్‌ దీక్షిత్‌ను ఎంత పిలిచినా స్పందన రాలేదు. దాంతో ఒక ప్యాకెట్‌ చిప్స్‌ తీసుకుని వెనుదిరిగాడు. అప్పుడొచ్చి చూసిన దీక్షిత్‌ కోపంతో క్రిషేందును దుకాణానికి లాక్కొచ్చి చెంపదెబ్బ కొట్టాడు. అందరి ముందూ గుంజిళ్లు తీయించడమే గాక బాలుని తల్లిని పిలిపించాడు.

 ఆమె కూడా కొడుకునే తిట్టి చెంపదెబ్బ కొట్టింది. ఎంత పిలిచినా దీక్షిత్‌ రానందుకే చిప్స్‌ తీసుకున్నానని, తరువాతైనా డబ్బులు ఇచ్చేవాడినని ఎంత చెప్పినా ఎవరూ విన్లేదు. దాంతో అందరి ముందూ దాస్‌ క్షమాపణలు చెప్పాడు. అయినా తాను అబద్ధం చెబుతున్నాడని దీక్షిత్‌ పదేపదే తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోకెళ్లగానే గదిలోకి దూరి గడియ వేసుకున్నాడు. 

దాంతో తల్లి ఇరుగుపొరుగును పిలిచి తలుపు పగలగొట్టింది. అప్పటికే బాబు నోటి నుంచి నురగలు వస్తున్నాయి. పక్కన సగం తాగిన పురుగుమందుల సీసా, బెంగాలీలో నోట్‌ కనిపించింది. ‘‘అమ్మా! నేను దొంగను కాదు. దొంగతనం చేయలేదు. చాలాసేపు  పిలిచినా మామయ్య (దుకాణదారు) రాలేదు. అందుకే కుర్కురే ప్యాకెట్‌ తీసుకున్నా. అవంటే నాకెంతో ఇష్టం కదా! ఇవి నా చివరి మాటలు. పురుగుమందు తాగినందుకు క్షమించు’’ అని అందులో రాశాడు. 

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)