Breaking News

రైల్వేస్టేషన్‌లో దారుణం.. ప్రొఫెసర్‌ దారుణ హత్య

Published on Sun, 01/25/2026 - 16:20

ముంబై: ఒక చిన్న తగాదా ప్రాణం తీసింది. మలాడ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ కళాశాల ప్రొఫెసర్‌ను ప్రయాణికుడు.. దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించిన ప్రొఫెసర్‌, ఒక ప్రయాణికుడి మధ్య చిన్న వివాదం విషాదాన్ని మిగిల్చింది. ఆ రైలు స్టేషన్‌ చేరుకోగా దిగేటప్పుడు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి.. పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రొఫెసర్‌గా అలోక్ సింగ్.. విలే పార్లేలోని ప్రముఖ కాలేజీలో పని చేస్తున్నారు. శనివారం ఆయన లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించారు. రైలులో సీటు విషయంలో ఓ ప్రయాణికుడు, ప్రొఫెసర్‌ అలోక్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ట్రైన్‌ మలాడ్ స్టేషన్‌ చేరగానే దిగే సమయంలో గేటు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగింది. దీంతో వారి మధ్య గొడవ మరింత ముదిరింది. ఆ  వ్యక్తి.. ప్రొఫెసర్‌ అలోక్ సింగ్‌ కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం స్టేషన్‌లోని జనం రద్దీలో కలిసిపోయి పరారయ్యాడు. దీంతో కత్తి పోట్లుతో అలోక్‌ సింగ్‌ కుప్పకూలి మరణించాడు.

ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు..  హత్య చేసిన వ్యక్తిని ఓంకార్ షిండే(27)గా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన కొద్దిసేపటికే వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పారిపోతుండటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. షిండేను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలులో సీటు కోసం జరిగిన చిన్న గొడవకే ప్రొఫెసర్‌ను షిండే దారుణంగా కత్తితో పొడిచి చంపడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వారి మధ్య గతంలో శత్రుత్వం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)