Breaking News

ప్రియాంకకు హైకోర్టు సమన్లు

Published on Wed, 06/11/2025 - 09:27

తిరువనంతపురం: కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ చిక్కుల్లో పడ్డారు. 2024 నవంబర్‌లో కేరళలోని వయనాడ్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ, బీజేపీ మహిళా నేత నవ్య హరిదాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన హైకోర్టు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు సమన్లు ​​జారీ చేసింది.

గత వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయాన్ని సవాలు చేస్తూ, నాటి పోల్ రద్దు కోరుతూ నవ్య హరిదాస్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియాంకా గాంధీ ఎన్నికల అఫిడవిట్‌లో తన, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను దాచిపెట్టారని ఆమె ఆరోపించారు. వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయం చెల్లదని ప్రకటించాలని  నవ్య కోరారు.

న్యాయవాది అయిన నవ్య హరిదాస్ సమర్పించిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు న్యాయమూర్తి కె బాబు విచారించారు. ప్రియాంక  రిటర్నింగ్ అధికారి ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో రాబర్ట్ వాద్రాకు సంబంధించిన పెట్టుబడులు, చరాస్తుల వివరాలను దాచిపెట్టారని  నవ్య ఆరోపించారు. వయనాడ్‌ స్థానంలో విజయం సాధించిన కాంగ్రెస్  అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆ స్థానాన్ని వదులుకోవడంతో 2024, నవంబర్ 13న వయనాడ్‌కు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ స్థానం నుంచి పోటీకి దిగిన ప్రియాంక గాంధీ వాద్రా  4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె తన సమీ ప్రత్యర్థి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి చెందిన సత్యన్ మోకేరిని ఓడించారు.  నాడు వయనాడ్‌లో కాంగ్రెస్‌, సీపీఐ, బీజేపీల మధ్య త్రిముఖపోరు జరిగింది. 

ఇది కూడా చదవండి: ‘హనీమూన్‌’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్‌ పరారైందిలా..

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)