Breaking News

ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ ఫోన్‌

Published on Sun, 11/02/2025 - 13:36

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు పరిష్కారంపై కాంగ్రెస్  ఎంపీ ప్రియాంక గాంధీ  తీవ్రంగా స్పందించారు. దీనిని తొలగించేందుకు తక్షణమే చర్యలు  చేపట్టాలని ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాలను కోరారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో  ప్రియాంకా గాంధీ స్పందిస్తూ.. తాను వయనాడ్ నుండి ఢిల్లీకి తిరిగి వచ్చినప్పుడు రాజధానిని కాలుష్యం బూడిద రంగు కవచంలా కప్పివేయడం చూసి, దిగ్భ్రాంతి చెందానని అన్నారు.

రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉన్నా, వాటిని పక్కనపెట్టి నేతలంతా ఢిల్లీలోని వాయు కాలుష్య సమస్య పరిష్కారం దిశగా ఏదైనా చేయాలని ఎంపీ ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు, సీనియర్ సిటిజన్ల విషయంలో తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని ఆమె కోరారు. కాలుష్య నియంత్రణ దిశగా తీసుకునే ఏ చర్యలకైనా కాంగ్రెస్  సహకరిస్తుందని ఎంపీ ప్రియాంక గాంధీ హామీనిచ్చారు.

క్లౌడ్ సీడింగ్ ఒక జోక్‌: జైరామ్ రమేష్
ఇదిలావుండగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన శీతాకాలపు క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్ (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ విమర్శించారు. ఈ ప్రయోగం కోసం రూ. 34 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆయన క్రూరమైన జోక్‌గా అభివర్ణించారు. గత  ఏడాది డిసెంబర్‌లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, భారత వాతావరణ శాఖ మొదలైనవి క్లౌడ్ సీడింగ్‌ను వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా స్పష్టమైన సలహా ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు.

క్లౌడ్ సీడింగ్ ప్రయోగం నాటకీయంగా కనిపిస్తున్నదని, ఈ  ప్రయోగంపై ముందు నుంచే పలు సందేహాలు ఉన్నాయని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. ఐఐటీ ఢిల్లీ కూడా తన నివేదికలో శీతాకాలపు క్లౌడ్ సీడింగ్ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఏ విధంగానూ సహాయపడదని స్పష్టం చేసిందన్నారు. ఒకటి లేదా రెండు రోజుల పాటు పరిమిత ప్రాంతంలో స్వల్ప మెరుగుదల కోసం  ఇటువంటి ప్రయోగం చేయడం క్రూరమైన జోక్ తప్ప మరొకటి కాదని జైరామ్ రమేష్ తన సోషల్‌ మీడియా  పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Mexico: సూపర్ మార్కెట్‌లో పేలుడు.. 23 మంది మృతి 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)