Breaking News

నిజం చెరగకూడదని.. చేతులు, కాళ్ల నిండా సూసైడ్‌ లేఖ రాసుకుని..

Published on Tue, 07/14/2026 - 16:01

భోపాల్: ఒక మహిళ ఎన్నో ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధను ఇక భరించలేకపోయింది. అత్తింట్లో ఎదుర్కొంటున్న వేధింపులు ఆమె మనసుని చంపేశాయి. ఎవరూ తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, తాను చనిపోతే తన గొంతు మూగబోతుందని, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఆవేదనతో కాగితంపై కాకుండా... తన చేతులు, కాళ్లపైనే మెహందీతో చివరి సందేశం రాసింది. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

ఛింద్వారాకు చెందిన ఓ మహిళ అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు ఆమె తన చేతులు, కాళ్లపై మెహందీతో సూసైడ్ నోట్ రాసింది. అందులో అత్తింట్లో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొన్న వేధింపుల గురించి రాసిన విషయాలు గుండెను కలిచివేస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం‌కు పంపించి కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతురాలి చేతులు, కాళ్లపై రాసిన సూసైడ్ నోట్‌కు వీడియోగ్రఫీ కూడా చేశారు.

చేతులు, కాళ్లపై సూసైడ్ నోట్ ఎందుకు?
చౌరై పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళ పేరు ప్రీతి వర్మ (32). ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ప్రీతికి సుమారు 13 ఏళ్ల క్రితం లఖన్ వర్మతో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి భర్త లఖన్, అతని కుటుంబ సభ్యులు ప్రీతిని వేధించేవారు.

మృతురాలు ప్రీతి సోదరుడు హరియోమ్ జాంగేలా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రీతి చనిపోయిన తర్వాత కాగితంపై రాసిన సూసైడ్ నోట్‌ను అత్తింటి వారు నాశనం చేసే అవకాశం ఉందని ఆమె భయపడి ఉండొచ్చని చెప్పారు. అందుకే తన శరీరంపైనే మెహందీతో సూసైడ్ నోట్ రాసిందని, అలా చేస్తే దాన్ని చెరపలేరని తెలిపారు. భర్త లఖన్ వర్మ, అత్తింటి వారు చాలాకాలంగా ప్రీతిని వేధించారని చెప్పారు. ఆమెపై మానసికంగా, శారీరకంగా వేధింపులు జరిగేవని తెలిపారు. ప్రీతి 2-3 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ప్రతిసారీ భర్త లఖన్ వర్మ ఆమెను నమ్మించి, బాగా చూసుకుంటానని తిరిగి తీసుకెళ్లేవాడని చెప్పారు.

వాంగ్మూలం ఇచ్చేలోపే ప్రీతి మృతి
పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రీతి వర్మ విషం తాగిన తర్వాత కుటుంబ సభ్యులు ముందుగా జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేసేలోపే శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ ప్రీతి చనిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)