Breaking News

Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు

Published on Sat, 02/22/2025 - 11:17

లక్నో: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ​కోట్లాదిమంది భక్తులు పవిత్ర సంగమస్థలిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తాజాగా యూపీలోని 75 జైళ్లలో గల ఖైదీలు కూడా త్రివేణీ సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారు. యూపీ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాగ్‌రాజ్‌ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని 75 జైళ్లకు తీసుకువచ్చారు. 

జైళశాఖ మంత్రి దారా సింగ్‌ నేతృత్వంలో ఖైదీల పుణ్యస్నానాల కార్యక్రమం సాగింది. లక్నో(Lucknow)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలంతా కుంభమేళాలో స్నానాలు చేయాలని ఉత్సాహం చూపిస్తుంటే, ఇక్కడి ఖైదీలకు ఎందుకు ఆ  అవకాశం కల్పించకూడదని అనిపించింది. అందుకే ఖైదీలకు కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని అనుకున్నాం’ అని అన్నారు. జైలు అధికారులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 75 జైళ్లలో మొత్తం 90 వేల మంది ఖైదీలున్నారన్నారు. జైళ్ల డైరెక్టర్ జనరల్(డీజీ) పీవీ రామశాస్త్రి మాట్లాడుతూ పవిత్ర సంగమం నుంచి తీసుకువచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని, ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి, తరువాత డ్రమ్ములలో నింపారన్నారు. ఆ తరువాత ఖైదీలంతా ప్రార్థనలు చేసి, పుణ్యస్నానాలు చేశారన్నారు. ప్రయాగ్‌రాజ్‌ నుంచి తెచ్చిన అమృత కలశంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు ఆచరించారని బాగ్‌పట్ జిల్లా(Baghpat District) జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఖైదీలు గంగామాతను కొనియాడుతూ ఎంతో ఉత్సాహంగా స్నానాలు చేశారని, ఈ అవకాశం కల్పించిన జిల్లా జైలు యంత్రాంగానికి ఖైదీలు కృతజ్ఞతలు తెలిపారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sambhal: లౌడ్‌ స్పీకర్‌ బ్యాన్‌ చేశారని..

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి