Breaking News

Video: కుర్చీ నుంచి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను బ‌ల‌వంతంగా తొల‌గించి

Published on Sat, 07/06/2024 - 14:46

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ పాఠ‌శాల‌లో ప్ర‌ధానోపాధ్యాయురాలి కుర్చీపై తీవ్ర దుమారం రేగింది. పాత హెడ్ మాస్ట‌ర్‌ను కుర్చీ నుంచి బ‌ల‌వంతంగా తొల‌గించి, కొత్త ప్ర‌ధానోపాధ్యాయురాలిని కూర్చోబెట్టారు మిగ‌తా ఉపాధ్యాయురాలు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇందులో  పాఠశాల సిబ్బంది బృందం ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఆమెను వెంటనే తన కుర్చీని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రిన్సిపాల్  పరుల్ సోలమన్‌ నిరాక‌రించ‌డంతో బలవంతంగా ఆమెను కుర్చీ నుంచి బ‌య‌ట‌కు తీసేశారు. ప్రిన్సిప‌ల్ ఫోన్ కూడా లాక్కున్నారు.

అనంత‌రం కొత్తగా నియమితులైన ప్రిన్సిపాల్‌ను ఆమె స్థానంలో కూర్చున్నారు, అక్కడ ఉన్న వారు చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్ జాన్సన్ బాలికల పాఠశాలలో ఈ నాటకీయ దృశ్యాలు చోటుచేసుకున్నాయి.  

మరోవైపు ప్రిన్సిపాల్‌ సీటును బలవంతంగా ఖాళీ చేయించడంపై పరుల్ సోలమన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరుల్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని ఆ స్కూల్‌ యాజమాన్యం పేర్కొంది. 

అయితే గ‌తంలో పాఠ‌శాల‌లో జ‌రిగిన యూపీపీఎస్సీ పేప‌ర్ లీక్ కేసులో ప్రిన్సిప‌ల్ ప్ర‌మేయం ఉన్న‌ట్లు తేల‌డంతో ఆమె స్థానంలో మ‌రొక‌రిని కూర్చొబెట్టారు. పేపర్ లీక్ ముఠా సభ్యుడు కమలేష్ కుమార్ పాల్ అలియాస్ కేకేకు ప్రిన్సిప‌ల్ ప‌రుల్ సోలోమ‌న్‌కు సంబంధం ఉన్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. దాంతో ఆమెను తొల‌గించారు. అయితే ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ షిర్లీ మాస్సీని నియమించిన‌ తర్వాత కూడా సోలమన్ ఆమె సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఈ గందరగోళం నెలకొంది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)