Breaking News

సోనియా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

Published on Fri, 01/31/2025 - 16:47

ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ (Union Budget 2025-26) సమావేశంలో తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (droupadi murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ ఎంపీ సోనియా గాంధీ (sonia gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నీ తప్పుడు హామీలే ఇచార్చు. పైగా రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో బాగా అలసి పోయారు. పూర్‌ థింగ్‌’ అంటూ కామెంట్స్‌ చేశారు. అయితే, సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం ధీటుగా బదులిచ్చింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది.

ఆ లేఖలో .. సోనియా గాంధీ వ్యాఖ్యలో ఆమోదయోగ్యంగా లేవు.  ఉన్నత పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తన మాటల్లో రాష్ట్రపతి అలసి పోయారని,చాలా కష్టంగా మాట్లాడారని అన్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని అనుకున్నాం.  

రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదు. ఎప్పటికి అలసిపోరు. బడ్జెట్‌ ప్రసంగంలో నిజానికి, అట్టడుగు వర్గాల కోసం, మహిళలు, రైతుల గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆమె ప్రసంగాన్ని నాయకులు  (సోనియాగాంధీని ఉద్దేశిస్తూ) హిందీ వంటి భారతీయ భాషలలోని యాస, ఉపన్యాసాలపై పరిచయం లేని కారణంగా రాష్ట్రపతి ప్రసంగంపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పడి ఉండొచ్చని రాష్ట్రపతి కార్యాలయం విశ్వసిస్తోంది. సోనియా గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఖండించదగినవి’ అని పేర్కొంది. 

👉చదవండి : రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)