Breaking News

చిన్నారుల పాటకు రాష్ట్రపతి ముర్ము కంటతడి

Published on Sat, 06/21/2025 - 04:37

న్యూఢిల్లీ: చిన్నారుల పాట విని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కరిగిపోయారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ముర్ము శుక్రవారం 67వ బర్త్‌డే జరుపుకున్నారు. డెహ్రాడూన్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ విజువల్‌ డిజబిలిటీస్‌కు వెళ్లిన ఆమెకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంధులైన చిన్నారులు రాష్ట్రపతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పాట ఆలపించారు. 

‘ఈ రోజులు మళ్లీ మళ్లీ రావాలి, నా హృదయం మళ్లీ మళ్లీ పాడాలి, మీరు వెయ్యేళ్లు జీవించాలి, ఇదే నా కోరిక, హ్యాపీ బర్త్‌ డే టూ యూ.. (బార్‌ బార్‌ దిన్‌ ఏ ఆయే, బార్‌ బార్‌ దిల్‌ యే గాయే, తు జియో హజారోం సాల్, యే మేరీ హై ఆర్జూ...)అంటూ సాగిన పాట విని ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయారు. ‘వాళ్లెంతో అందంగా, హృద్యంగా పాడారు. నేనెంతో ఉద్వేగానికి లోనయ్యా. వారి పాటవిని సంతోషంతో ఉప్పొంగిపోయా. 

నా కళ్ల వెంట నీళ్లు ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయి’అని ఆమె పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ముర్ముకు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసించారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో 1958 జూన్‌ 20వ తేదీన ముర్ము జన్మించారు. దేశానికి 15వ రాష్ట్రపతిగా 2022 జూలై 25న బాధ్యతలు చేపట్టారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)