Breaking News

జైపూర్‌లో మోదీ, మాక్రాన్ రోడ్ షో

Published on Thu, 01/25/2024 - 19:45

జైపూర్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీ నేడు జైపూర్‌లో రోడ్ షో నిర్వహించారు. మాక్రాన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం జైపూర్ చేరుకున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఆయనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్ రాజ్ మిశ్రా స్వాగతం పలికారు. అటు.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా జైపూర్‌ చేరుకున్నారు. అనంతరం జైపూర్‌లో ఇద్దరూ రోడ్‌షో నిర్వహించారు. 

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించారు. ఈ పర్యటన తర్వాత మాక్రాన్‌, మోదీ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఫ్రెంచ్ ఆర్మీకి చెందిన బృందం సిద్ధమైంది. ఈ పర్యటనలో ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్‌ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు సమాచారం. ఇ​క, ఫ్రాన్స్‌.. భారత్‌కు ఆయుధాలను అందిస్తున్న రెండో అతిపెద్ద మిత్ర దేశంగా కొనసాగుతోంది.

ఇదీ చదవండి: నేడు భారత్‌కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌.. మోదీతో స్పెషల్‌ ప్రోగ్రామ్‌..

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు