Breaking News

బస్తర్‌లో అభివృద్ధి పొద్దు పొడిచింది

Published on Sun, 02/08/2026 - 06:18

జగ్దల్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాత్మక చర్యలతో మావోల భయానక వాతావరణం సమసిపోయి అభివృద్ధి పొద్దు పొడిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. శనివారం బస్తర్‌ జిల్లా కేంద్రమైన జగ్దల్‌పూర్‌లో మూడ్రోజుల డివిజనల్‌ స్థాయి సంప్రదాయ బస్తర్‌ పండుమ్‌ వేడుకను ఆమె ప్రారంభించి అక్కడి కళాకారులు, వందలాది మంది ప్రేక్షకులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

‘‘ హింసను విడనాడి ప్రజా స్రవంతిలో కలిసిపోయిన వాళ్లు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచండి. మరెప్పుడూ మళ్లీ ఆ అశాంతియుత మార్గం వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండండి. బస్తర్‌ సహజ సౌందర్యం, గణమైన సాంస్కృతిక సంప్రదాయాలు అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇలాంటి ప్రాంతం దశాబ్దాలుగా మావోయిజం కారణంగా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. నక్సలిజం అనేది ఇక్కడి యువత, గిరిజనులు, దళితులను అన్నిరకాలుగా నష్టపోయేలా చేసింది. 

మావోయిస్ట్‌ కార్యకలాపాల్లో నిమగ్నమైన వాళ్లు సైతం ఇప్పుడు హింసను విడనాడారు. దీంతో ఇక్కడ మళ్లీ శాంతివనాలు వృద్ధిచెందుతున్నాయి. భయం, అవిశ్వాస మబ్బులు మటుమాయం కావడానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాత్మక వైఖరే కారణం. పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. వాళ్లు గౌరవప్రదంగా బతికేందుకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇక్కడి గ్రామాలు సాధికారత సాధించేందుకు నియాద్‌ నెల్లనార్‌ సహా ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం ఎంతో సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. 

గ్రామాలకు కొత్తగా విద్యుత్, రహదారులు, తాగునీటి సదుపాయాలొచ్చాయి. ఇదెంతా మనసుకు హత్తుకునే సజీవచిత్రంగా తోస్తోంది. ప్రభుత్వ కృషి, ప్రజల తోడ్పాటుతో బస్తర్‌లో కొత్త అభివృద్ధి శకం మొదలవుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ పీఎం జన్‌మన్, ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్‌ ఉత్కర్‌‡్ష యోజన వంటి పథకాలు దన్నుగా నిలుస్తున్నాయి. గిరిజన చిన్నారులకు విద్యను మరింత చేరువ చేసేందుకు వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ఎకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాట్లూ పూర్తయి అవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి’’ అని రాష్ట్రపతి అన్నారు.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)