Breaking News

ప్రజలతో సున్నితంగా వ్యవహరించండి

Published on Fri, 08/01/2025 - 00:24

దియోగఢ్‌: వైద్యులను దేవుళ్లుగా భావించే ప్రజలతో సున్నితంగా వ్యవహరించాలని రాష్ట్రపతి ముర్ము వైద్య నిపుణులకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లోని దియోగఢ్‌ ఎయిమ్స్‌లో గురువారం జరిగిన మొట్టమొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. నైతిక విలువలను పాటిస్తూ రోగుల పట్ల సహానుభూతితో ప్రేమతో మెలగాలన్నారు. వారి జీవితాల్లో చీకట్లు తొలగించాలని కోరారు.

 ‘గిరిజనుల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే ఎయిమ్స్‌ దియోగఢ్‌ ఇప్పటికే ఉన్న ఐదింటితోపాటు మరిన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఇతర ఎయిమ్స్‌లకు ఒక ఆదర్శంగా మారేందుకు కృష్టి చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, పిల్లలలో పోషకాహార లోపం సర్వసాధారణంగా మారిందని రాష్ట్రపతి తెలిపారు. 

ఈ నేపథ్యంలో వైద్యులు సామాజిక సేవపైనా దృష్టిసారించాలన్నారు. సుదూర గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు యాంటీ వీనమ్‌ ఔషధాలను డ్రోన్ల ద్వారా అందిస్తున్న దియోగఢ్‌ ఎయిమ్స్‌ను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. ఈ సంస్థతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందంటూ ఆమె..జార్ఖండ్‌ గవర్నర్‌ తాను వ్యవహరించిన సమయంలోనే ప్రధాని మోదీ 2018లో ఎయిమ్స్‌ దియోగఢ్‌కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్రపతి జార్ఖండ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఐఐటీ ధన్‌బాద్‌ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)