Breaking News

Uttar Pradesh: విద్యార్థి ఆందోళనలు ఉధృతం.. బారికేడ్లను దాటుకుని..

Published on Thu, 11/14/2024 - 13:03

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ తీరుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(గురువారం) కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో  గందరగోళం చెలరేగింది.

పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనను తొలగించుకుంటూ విద్యార్థులు కమిషనర్‌ కార్యాలయం వైపు కదిలారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీఎస్‌ ప్రిలిమ్స్ 2024, ఆర్‌/ఏఆర్‌ఓ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను రెండు రోజుల్లో రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్‌లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట సోమవారం నుంచి వేలాది మంది విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని కమిషన్ కార్యాలయం వద్దనున్న మూడు రోడ్ల కూడలిలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బారికేడ్లతో మూడు రహదారులను మూసివేసి భద్రతను పెంచారు. కాగా కొందరు పోలీసులు రాత్రిపూట సాధారణ దుస్తులలో వచ్చి కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఈరోజు(గురువారం) నిరసన స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కూడలి వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. వీరిలో కొందరు కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

కాగా బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేట్ నంబర్ టూ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులతో మాట్లాడేందుకు జిల్లా డీఎం రవీంద్ర కుమార్, పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వచ్చారు. డిఎం రవీంద్రకుమార్ గంటపాటు విద్యార్థులతో మాట్లాడి  నిరసనను విరమించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)