Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు

Published on Thu, 01/30/2025 - 09:05

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలువురు విమానాల్లోనూ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు విమానయాన ఛార్జీలను అమాంతం పెంచేశాయి.

ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీల పెంపు పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. మహా కుంభమేళా వేళ ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న విమానయాన సంస్థలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. విమానయాన సంస్థలు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను కొనసాగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ  సూచించింది. ఈ నేపధ్యంలో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీలను 30 నుంచి 50 శాతం మేరకు తగ్గించింది.

మహా కుంభమేళా సమయంలో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు పలు విమానయాన సంస్థలతో సమన్వయ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో, విమానయాన సంస్థల ప్రతినిధులు, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి, దేశంలో వివిధ నగరాల నుంచి 132 విమానాలు ప్రయాగ్‌రాజ్‌కు సేవలు అందిస్తున్నాయి.

ఇండిగో తన వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 16 వరకు ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమానాలకు టిక్కెట్ ధరలు రూ.13,500 కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరి 31న ధరలు రూ.21,200 పైగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 12కి ధరలు తగ్గి రూ.9 వేలకు  చేరనున్నాయని తెలిపింది. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవతో విమానయాన సంస్థలు టిక్కెట్‌ ఛార్జీలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. 

ఇది కూడా చదవండి; Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)