Breaking News

సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌

Published on Sun, 05/14/2023 - 15:37

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ ఎంపికయ్యారు. ఈయన రెండేళ్లపాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌ సూద్‌.. ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవికాలం పూర్తయిన తర్వాత ఆయన నుంచి సూద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ పలవురు పేర్లను పరిశీలించి ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ఎంపిక చేసింది. ఈ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, లోక్‌సభ ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి ఉన్నారు. ఈ కమిటీ శనివారం సాయంత్రం సమావేశమై తదుపరి సీబీఐ డైరెక్టర్ పదవికి కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్య ప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, తాజ్ హాసన్‌లను ఎంపిక చేసింది. వీరిలో కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ఖరారయ్యారు. 

కాగా సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైనవారి పదవీ కాలం రెండేళ్లు. అయితే ఈ పదవీ కాలన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, లోక్‌పాల్ సభ్యుడు పదవుల కోసం అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న జైశ్వాల్‌.. 1985 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహారాష్ట్ర కేడర్‌. గతంలో ముంబై పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2021 మే 26న సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబోధ్‌ కుమార్‌ రెండేళ్ల పదవీకాలం మే 25తో పూర్తికానుంది.
చదవండి: సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)