నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

Published on Sun, 02/19/2023 - 10:31

నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తనను బాధించిందని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న సినీ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్నారని కొనియాడారు.

ఇలాంటి బాధాకర సమయంలో తారకరత్న కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం పీఎంఓ ట్వీట్ చేసింది.

రేవంత్ రెడ్డి సంతాపం..
తారకరత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను బాధించిందన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

గుండెపోటుతో 23 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన తారకరత్న శనివారం బెంగళూరులోని హృదయాలయలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు.

బండి సంజయ్ ట్వీట్‌..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తారకరత్న మృతికి సంతాపం తెలిపారు.

హరీశ్‌రావు..
తారకరత్న మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆయన కుటుంసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

డీకే అరుణ
బీజేపీ నేత డీకే అరుణ కూడా తారకరత్న మృతికి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

చంద్రబాబు సంతాపం..
తారకరత్న తమ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చి వెళ్లిపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

నారా లోకేష్..

తార‌క‌ర‌త్న మృతి తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)