love @ 19: ప్రియుడు మృతి.. పోలీసుల జోక్యంతో ప్రియురాలు సేఫ్‌

Published on Sun, 09/21/2025 - 09:16

ముంబై: మహానగరం ముంబైలో 19 ఏళ్ల యువతీయువకుల ప్రేమ వ్యవహారం సంచలనంగా మారింది. పోవాయ్‌ ప్రాంతంలో తన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న 19 ఏళ్ల ప్రియురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే  పోలీసుల జోక్యంతో ఆమె ‍ప్రాణాలతో బయటపడింది.

ఘాట్కోపర్‌లోని పార్క్‌సైట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం పోవాయ్‌లోని మహాత్మా ఫులే మార్కెట్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు  ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఇందుకు అతని ‍ప్రియురాలే కారణమని భావిస్తూ, ఆమె ఇంటికి వెళ్లి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఎటువంటి అఘాయిత్యం చేసుకోకూడదనే భావనతో ఆమె ఇంటికి వెళ్లారు.

అయితే ఆమె ఉంటున్న ఇంటికి తాళం వేసివుంది. దీంతో ఒక కానిస్టేబుల్‌ తలుపులు బద్దలు కొట్టి, లోనికి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆమె ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని విలవిలలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులు ఆమెకు కిందకు దించి, ఘాట్కోపర్‌లోని రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. యువకుని మృతిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)