Breaking News

ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. సెల్ఫీలు దిగుతూ.. 

Published on Fri, 06/30/2023 - 08:12

లక్నో: తన భార్య తీసిన సెల్ఫీ ఫొటో ఓ పోలీసు అధికారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో, సదరు పోలీసు అధికారి బదిలీ కావాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సెల్ఫీ ఫొటోలో ఏం ఉందనుకుంటున్నారా?. అక్షరాల 14 లక్షల రూపాయల నోట్ల కట్టలు. కాగా, కరెన్సీ నోట్లతో దిగిన సెల్ఫీ వైరల్‌ కావడంతో పోలీసులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఉన్నావ్ జిల్లా బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్‌ చంద్ర సహాని ఎస్‌ఐగా పని చేస్తున్నారు. అయితే, ఇటీవల సహాని భార్య, అతని పిల్లలు వారి ఇంట్లో ఉన్న రూ.500 నోట్ల కరెన్సీ కట్టలతో సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక, సెల్ఫీ ఫొటో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. సహానిపై విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో సహానిని వెంటనే మరో ప్రాంతానికి  బదిలీ చేశారు. 

అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిని ఫొటోలో 14 లక్షల రూపాయల విలువైన నగదును ఒక బెడ్‌పై పెట్టి..  ఆ నోట్ల కట్టల పక్కన సహానీ భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని ఫొటోకు స్టిల్‌ ఇచ్చారు. ఇక, ఈ ఫొటోపై ఎస్‌ఐ సహాని క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటో నవంబర్ 14, 2021న తాను కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసుకున్నదని చెప్పుకొచ్చాడు.

మరోవైపు.. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. రమేష్‌ చంద్ర సహానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారణ జరుపుతున్నాము. ఆ ఫోటోలో ఆ పోలీసు అధికారి భార్య , అతని పిల్లలు ఉన్నారు. వారు నోట్ల కట్టలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు అధికారి బదిలీ చేయబడ్డారు. అతనిపై దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత ఆ పెద్దాయనకి షాక్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)