Breaking News

కారు ధర రూ.70వేలు.. జరిమానా తెలిస్తే షాక్..!

Published on Fri, 01/16/2026 - 16:25

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో  కారుతో బీభత్సం సృష్టించిన ఒక ఆకతాయికి పోలీసులు తగిన శిక్ష వేశారు.  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నడిరోడ్డుపై మాడిఫై చేసిన కారుతో సినిమా స్టంట్‌లు చేస్తూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బీభత్సం సృష్టించాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారి పోలీసుల వరకూ చేరడంతో రూ. లక్షకు పైగా జరిమానా విధించారు.

ఇటీవలే  న్యూఇయర్ వేడుకలు జరుపకోవడానికి కేరళ కన్నూరుకు  చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బెంగళూరుకు వచ్చారు. అయితే అతను 2002కు చెందిన హోండా సిటీ కారును రూ. 70 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం దానిని రూ. లక్ష ఖర్చు చేసి ఆధునాతనంగా మాఢిపై చేయించాడు. ఈ కారుతో బెంగళూరు రోడ్లపై ప్రమాద కరంగా విన్యాసాలు చేశాడు. మంటలు విదజిమ్ముతూ కారును నడిపాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.    

దీంతో వీటిని చూసి భయాందోళనలకు గురైన ప్రజలు వాటి వివరాలను పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు ఆ కారును స్వాధీన పరుచుకొని అనంతరం దానిపై రూ. 1,11,500 భారీ జరిమానా విధించారు. ఆ యువకుడు ఆ మెుత్తాన్ని చెల్లించడంతో కారును అతనికి అప్పజెప్పినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ విధంగానే జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)