Breaking News

సైఫ్‌పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్‌ 

Published on Sat, 01/18/2025 - 19:06

దుర్గ్‌: నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ రైల్వే స్టేషన్‌లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోకమాన్య తిలక్‌ టెరి్మనస్‌(ఎలీ్టటీ)నుంచి కోల్‌కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాశ్‌ కైలాశ్‌ కనోజియా(31)గా గుర్తించారు. 

సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రెయిన్‌లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుర్గ్‌ రైల్వే పోలీసులను అలెర్ట్‌ చేశారు. అనుమానితుడి సెల్‌ ఫోన్‌ లొకేషన్‌తోపాటు అతడి ఫొటోను షేర్‌ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్‌ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్‌నంద్‌గావ్‌ స్టేషన్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రాజ్‌నంద్‌గావ్‌లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. 

దీంతో, ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్‌ రైల్వే స్టేషన్‌లో రెండు బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్‌ బోగీలో ఉన్న ఆకాశ్‌ను వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫొటోను ముంబై పోలీసులకు పంపి నిర్థారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్‌పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనంమెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డవడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్‌పూర్‌ వెళ్లి ఆకాశ్‌ కైలాశ్‌ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)