Breaking News

11న సోమనాథ్‌ ఆలయానికి వెళ్తున్నా

Published on Tue, 01/06/2026 - 05:51

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. సోమనాథ్‌ ఆలయంపై విదేశీయులు మొదటిసారిగా దాడి జరిపి, ధ్వంసం చేసిన దురాగతానికి వెయ్యేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమనాథ్‌ స్వాభిమాన్‌ పర్వ్‌ పేరుతో ఏడాదంతా వివిధ కార్యక్రమాలను తలపెట్టారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి.

 సోమనాథ్‌ను 11వ తేదీన సందర్శించుకోనున్నట్లు ప్రధాని సోమవారం ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ‘సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణం భారతీయ నాగరికత అజేయ సంకల్పానికి, బలానికి గొప్ప నిదర్శనం. విదేశీ దురాక్రమణదారులు ఎన్నిసార్లు దాడి చేసినా, ప్రతిసారీ ఈ పుణ్యక్షేత్రం మరింత వైభవోపేతంగా తిరిగి పుంజుకుంది’అని పేర్కొన్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతం వెరావల్‌లో అరేబియా సముద్ర తీరాన ఉన్న సోమనాథ్‌ ఆలయంలో శివుడు కొలువుతీరాడు.

 ఈ ఆలయంపై మొదటిసారిగా తుర్కియే పాలకుడు గజనీ మహ్మద్‌ దాడి చేసి, విధ్వంసం సృష్టించాడు. అప్పట్నుంచి పలువురు విదేశీ పాలకులు దాడి చేసి దోచుకున్నారు. ‘సోమనాథ్‌ కథ కేవలం ఒక ఆలయానికి సంబంధించింది కాదు, అది మన సంస్కృతిని, నాగరికతను కాపాడిన భారతమాత కోట్లాది సంతానానికి చెందిన అజేయమైన సాహసగాథ. 

శతాబ్దాల తరబడి దాడులు, వలసవాద దోపిడీలను తట్టుకుని నిలబడిన ఈ స్ఫూర్తే నేడు మన దేశాన్ని ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అత్యంత వేగంగా ముందుకు సాగుతున్న దేశంగా నిలబెట్టింది’అని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆలయాన్ని పునర్నిర్మించే విషయంలో సర్దార్‌ పటేల్‌ ఎంతో చొరవ కనబరిచారన్న ప్రధాని మోదీ...1951లో జరిగిన ఆలయ ఉత్సవాలకు అప్పటి ప్రధాని నెహ్రూ వెళ్లలేదంటూ నిందించారు. ‘1947లో దీపావళి వేడుకల వేళ సర్దార్‌ పటేల్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. అప్పుడే ఆయన ఆలయానికి పూర్వవైభవం తేవాలని నిర్ణయించుకున్నారు’’ అని మోదీ చెప్పారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు