శాంతి కోసం యత్నిస్తే.. శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది: ప్రధాని మోదీ

Published on Sun, 03/16/2025 - 20:12

న్యూఢిల్లీ:  ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి(పాకిస్తాన్)తో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు.  వారితో శాంతి చర్చలు చేసిన ప్రతీసారి ద్రోహం​, శత్రుత్వం మాత్రమే ఎదురైంది. వారికి ఎప్పటికైనా జ్ఞానం కలిగి తమతో శాంతి మార్గాన్ని ఎంచుకుంటారనే ఆశిస్తున్నామన్నారు ప్రధాని మోదీ., 

లెక్స్ ఫ్రిడ్‌  మ్యాన్ తో జరిగిన పాడ్ కాస్ట్ లో  పాకిస్తాన్ తో ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకున్నారు.2014లో తాను ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ తో  సంబంధాలు తిరిగి గాడిలో పడతాయని ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ వారితో ఎప్పుడు శాంతి ప్రయత్నాలు చేసినా అవి విఫలంగానే మిగిలిపోయాయన్నారు మోదీ.

కాకపోతే పాకిస్తాన్ లో ప్రజలు ఎప్పట్నుంచో శాంతిని కోరుకుంటున్నారని, వారు ఇప్పటికే అక్కడ జరిగే ఉగ్రదాడులతో అలసిపోయి ఉన్నారన్నారన్నారు. తాను తొలిసారిగా ప్రధానిగా సేవలందించే క్రమంలోనే పాకిస్తాన్ తో శాంతి చర్చల కోసం ఆహ్వానించానన్నారు.

‘దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు  అడుగులు వేశాం.   విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు.. అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని  మన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  తన జ్ఞాపకాలలో అందంగా రాసుకున్నారు కూడా’ అని మోదీ పేర్కొన్నారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)