Breaking News

మణిపూర్‌ సీఎంను తొలగించండి

Published on Tue, 06/27/2023 - 06:01

న్యూఢిల్లీ: మణిపూర్‌లో దాదాపు రెండు నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని మోదీ మౌనం దాల్చడమేంటని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మణిపూర్‌ గురించి ప్రధాని మోదీ నిజంగా ఆందోళన చెందుతున్నట్లయితే ముందుగా చేయాల్సింది ఆ రాష్ట్ర సీఎంను తొలగించడమేనన్నారు. మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం ఆ విషయాన్ని కప్పిపుచ్చు కోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పలు ట్వీట్లు చేశారు. ‘గడిచిన 55 రోజుల్లో మణిపూర్‌ గురించి ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఏం చెబుతారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.

మోదీ జీ నిజంగా మణిపూర్‌లో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నట్లయితే, అక్కడి బీజేపీ సీఎంను ముందుగా తొలగించండి’అని పేర్కొన్నారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాద సంస్థల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. అన్ని పార్టీలతో సంభాషణలు జరిపి, ఉమ్మడి రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని ప్రభుత్వానికి ఖర్గే సూచించారు. ‘రాష్ట్రంలో జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణానికి వీలు కల్పించాలి. ప్రజలకు నిత్యావవసర వస్తువులను అందుబాటులోకి తేవాలి.  సహాయ, పునరావాస ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలి’అని ఖర్గే పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)