Breaking News

మన జెన్‌ జెడ్‌లో పుష్కలంగా సృజన

Published on Tue, 01/13/2026 - 04:50

న్యూఢిల్లీ: భారతీయ జెన్‌ జెడ్‌ యువతరంలో సృజనాత్మకత పుష్కలంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2047 ఏడాదికల్లా భారత్‌ను అభివృద్ధిచెందిన దేశంగా వికసిత్‌ భారత్‌గా అవతరింపజేసుకునేందుకు యువత తమ వంతుగా అందించే వినూత్న, సృజనాత్మక ఆలోచనల వేదికగా వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌(బీవీవైఎల్‌డీ)ను మోదీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. 

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 12వ తేదీన బీవీవైఎల్‌డీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో వీబీఐఎల్‌డీ ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘ ఏటా స్వామి వివేకానంద గౌరవార్థం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన స్ఫూర్తితో వీబీవైఎల్‌డీని స్థాపించాం. యువతను దృష్టిలో ఉంచుకుని పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చాం. అంకురసంస్థల విప్లవాన్ని ఆశిస్తున్నాం.

 ఇప్పుడు సృజనాత్మక ఆలోచనలు, శక్తి, సదుద్దేశాలతో మన యువశక్తి ఇప్పుడు దేశ నిర్మాణంలో ముందు వరసలో నిలబడింది. సృజనాత్మక ఆలోచనలు, సమా చారం, సంస్కృతిలతో ఆరెంజ్‌ ఎకానమీ గణనీయమైన వృద్ధిపథంలో పయనిస్తోంది. గత దశాబ్దకాలంగా చేపట్టిన పలు సంస్కరణలతో ఇప్పుడు ఏకంగా సంస్కరణ ఎక్స్‌ప్రెస్‌ దూసుకుపోతోంది. ఈ సంస్కరణల కేంద్ర బిందువు మన యువతలోనే దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. జనవరి 9వ నుంచి 12వ తేదీదాకా బీవీవైఎల్‌డీ కొనసాగింది. దేశవ్యాప్తంగా పలు స్థాయిల్లో 50 లక్షల మందికిపైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంది.  

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)