Breaking News

మహిళా సాధికారతకు కృషి 

Published on Sat, 09/27/2025 - 05:41

పట్నా: బిహార్‌లో మహిళా సాధికారత కోసం ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకం 75 లక్షల మంది పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేశారు. రూ.7,500 కోట్లతో ఈ పథకానికి బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 75 లక్షల మంది లబి్ధదారులకు త్వరలో అదనంగా రూ.2 లక్షల చొప్పున అందజేయబోతున్నామని ప్రధాని వెల్లడించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. వారు స్వయం ఉపాధి పొందవచ్చని సూచించారు.

 ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బిహార్‌ మహిళల ప్రగతి కోసం నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం కీలకమైన అడుగు ముందుకు వేసిందని అన్నారు. మన అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలు ఉద్యోగాలు సంపాదిస్తే, స్వయం ఉపాధి పొందితే వారి కలలకు రెక్కలొచ్చినట్లేనని చెప్పారు. సమాజంలో వారి గౌరవం మరింత పెరుగుతుందని ఉద్ఘాటించారు. 11 ఏళ్ల క్రితం తాము తీసుకున్న ‘జన్‌ధన్‌ ఖాతాల’ సంకల్పం వల్లే ఈరోజు 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైందని వివరించారు.   

వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

మహిళలకు ఇద్దరు సోదరులు  
బిహార్‌ మహిళలకు నితీశ్‌ కుమార్, నరేంద్ర మోదీ అనే ఇద్దరు సోదరులు ఉన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ సోదరీమణుల బాగు కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం పట్ల గరి్వస్తున్నానని స్పష్టంచేశారు. ఇటీవలే ప్రారంభించిన ‘జీవిక నిధి సఖ్‌ సహకారి సంఘ్‌’ను ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజనతో అనుసంధానిస్తామని ప్రకటించారు. పీఎం ఉజ్వల యోజన, ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో 8.5 కోట్ల మంది బిహారీల జీవితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లఖ్‌పతీ దీదీలుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా మహిళలు లఖ్‌పతీ దీదీలుగా మారారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)