Breaking News

వికసిత్‌ భారత్‌కు రోడ్‌మ్యాప్‌

Published on Mon, 02/02/2026 - 02:42

‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్‌. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్‌. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో 140 కోట్ల మంది భారతీయులు సంతృప్తి చెందడం లేదు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగాలని కోరుకుంటున్నారు. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, పెట్టుబడి వ్యయాన్ని పెంచడం, అధిక వృద్ధిని సాధించడమే ధ్యేయంగా బడ్జెట్‌ రూపుదిద్దుకుంది. ఇది భారతీయుల సమ్మిళిత సంకల్పం. విశ్వసనీయ ప్రజాస్వామ్య భాగస్వామిగా, విశ్వసనీయ నాణ్యమైన ఉత్పత్తుల సరఫరాదారుగా భారత్‌ పాత్ర మరింత విస్తరిస్తుంది.

యువతకు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌ను రూపొందించారు. ఈ చరిత్రాత్మక బడ్జెట్‌ యువత ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మహిళల సాధికార స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. గ్రామాల సంక్షేమం, పేదలు, రైతుల అభివృద్ధి కోసం చక్కటి బడ్జెట్‌ను తీసుకొచ్చిన నిర్మలా సీతారామన్, ఆమె     బృందానికి నా అభినందనలు. వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉంది. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్‌ ఒక రహదారి. వికసిత్‌ భారత్‌–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం.

మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి  రోడ్‌మ్యాప్‌గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్‌ నుంచి గ్లోబల్‌ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన చర్యలతో ‘అభివృద్ధి చెందిన భారత్‌’ దిశగా మన ప్రయాణం వేగవంతమవుతుంది. ఏ దేశానికైనా ప్రజలే అతిపెద్ద బలం. అందుకే ప్రజల్లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు పెంచడానికి   కృషి చేస్తున్నాం. యువశక్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తాజా బడ్జెట్‌తో వేర్వేరు కీలక  రంగాల్లో నాయకులు, నూతన ఆవిష్కరణలు తయారు కాబోతున్నారు. క్రీడా రంగంలో యువతకు నూతన అవకాశాలు దక్కబోతు న్నాయి.

మన దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్‌ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పన్ను మినహా యింపులు ప్రకటించాం. దేశంలో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టికి  మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మహిళల సారథ్యంలోని స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుంచి మరింత మద్దతు దక్కుతుంది. ప్రతి జిల్లాలో బాలికల కోసం కొత్త హాస్టళ్లు రాబోతున్నాయి. దాంతో వారి విద్యాభ్యాసం మరింత మెరుగవుతుంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమలు ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలే. కొబ్బరి, జీడిపప్పు, కోకోవా, చందనం రైతులకు బడ్జెట్‌లో ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించాం’’     – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ   

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)