Breaking News

‘సంవిధాన్‌ సదన్‌’లో స్పీకర్ల సందడి

Published on Thu, 01/15/2026 - 06:41

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకమైన 28వ కామన్వెల్త్‌ స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తాబైంది. జనవరి 15న ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని ‘సంవిధాన్‌ సదన్‌’ సెంట్రల్‌ హాల్‌లో ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తర్వాత సభికులనుద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. 

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు భారీ స్పందన లభించింది. కామన్వెల్త్‌ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో సమకాలీన పార్లమెంటరీ సవాళ్లు, పరిష్కారాలపై విస్తృతంగా మేధోమథనం జరగనుంది. 

ప్రధానంగా ప్రజాస్వామ్య సంస్థలను పటిష్టం చేయడంలో స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల కీలక పాత్రపై చర్చించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ పనితీరులో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంట్‌ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం వంటి అంశాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా పార్లమెంటరీ ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన కల్పించేందుకు అనుసరించాల్సిన వినూత్న వ్యూహాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. 

సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలు.. 
1.    ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల బాధ్యత ఎంత?
2.    మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?
3.    పార్లమెంట్‌ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?
4.    చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా? 
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)