Breaking News

పార్టీకి ఆదరణ ఉన్నా నేతలు విఫలం!

Published on Fri, 12/12/2025 - 01:13

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ పరిస్థితి, తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవ డంలో నేతలు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గురువారం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎంపీలతోనూ భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగానే రాష్ట్రంలో పార్టీ పనితీరు, నేతల వ్యవహారంపై మోదీ గరం గరం అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రం నుంచి 8 మంది చొప్పున బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో సైతం వెనుకబడుతున్నారంటూ మందలించారు. విభేదాలు వీడి పార్టీ ఎదుగుదల కోసం అంతా ఐక్యంగా పనిచేయాలని, పార్టీ గ్రాఫ్‌ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి..
‘సమష్టి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లి అధికార కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాలి. కేంద్రం అంది స్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై కేంద్రం అందిస్తున్న నిధుల గురించి వివరించాలి. మండలం నుంచి పార్లమెంట్‌ స్థాయి వరకు క్రీడా పో టీలు నిర్వహించాలి. యువతలో క్రీడా స్ఫూర్తి నింపాలి. భవిష్యత్‌ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఇప్పటినుంచే మరింత బలంగా పనిచే యాలి..’ అని ప్రధాని మోదీ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రధాని విందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు
గురువారం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. మోది నివాసం 7 లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ విందుకు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు..బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గొడెం నగేష్‌ హాజరయ్యారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)