Breaking News

అది ముస్లింలీగ్‌ మావోయిస్టు కాంగ్రెస్‌

Published on Sat, 01/24/2026 - 05:20

తిరువనంతపురం: విపక్ష కాంగ్రెస్‌ అధికారం కోసం సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తోందని, ముస్లిం లీగ్‌తో అంటకాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ముస్లింలీగ్‌ మావోయిస్టు కాంగ్రెస్‌(ఎంఎంసీ)గా మారిపోయిందని ఆరోపించారు. శుక్రవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్‌ దుష్ట రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వారి దుర్మార్గ వ్యూహాలకు కేరళను ప్రయోగశాలగా వాడుకుంటున్నారని చెప్పారు. 

కాంగ్రెస్‌కు అభివృద్ధి అజెండా లేదన్నా రు. మావోయిస్టులను మించిన కమ్యూ నిస్టులుగా, ముస్లింలీగ్‌ను మించిన మతతత్వవాదులుగా మారిపోయారని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్‌ తీరుపై మండిపడ్డారు. శబరిమలలో అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అయ్యప్ప బంగారాన్ని సైతం చోరీ చేశారని విమర్శించారు. కేరళలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే  బంగారం చోరీపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దోషులను గుర్తించి జైలుకు పంపిస్తామన్నారు. ఇదీ మోదీ గ్యారంటీ అని స్పష్టంచేశారు. 

రాష్ట్రంలో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఒక్కటేనని విమర్శించారు. అవినీతికి చరమగీతం పాడి అభివృద్ధికి బాటలు వేసే బీజేపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు. మన నినాదం ‘వికసిత్‌ కేరళం’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మార్పునకు ఇదే సరైన సమయమని వెల్లడించారు. గుజరాత్‌లో నాలుగు దశాబ్దాల క్రితం తొలుత అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పాగా వేసి, క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించామని అధికారం దక్కించుకున్నామని మోదీ గుర్తుచేశారు.

 అదే తరహాలో కేరళలోని తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ను గెల్చుకు న్నామని, ఇక రాష్ట్రంలో అధికారంలోకి రాబోతు న్నామని ధీమా వ్యక్తంచేశారు. గుజరాత్‌ ఫలితం కేరళలో పునరావృతం అవుతుందన్నారు. తిరువ నంతపురం మేయర్‌గా ఎన్నికైన వి.వి.రాజేశ్‌ను బహిరంగ సభ వేదికపై ప్రధాని మోదీ అభినందించారు. ఆయనతో కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. డిప్యూటీ మేయర్‌ ఆశానాథ్‌.. మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. ప్రధాని మోదీ కేరళలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)