Breaking News

ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నా..

Published on Sat, 08/31/2024 - 05:25

పాల్ఘార్‌: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహం కూలిపోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన పట్ల శివాజీని, శివాజీ అభిమానులను క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.. శివాజీ అంటే కేవలం ఒక పేరు, ఒక పాలకుడు కాదని అన్నారు. ఆయన మనకు ఒక దైవం అని స్పష్టంచేశారు. 

ఈ రోజు ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. విగ్రహం కూలిపోవడం పట్ల శివాజీ అభిమానుల మనసులు గాయపడ్డాయని, వారందరినీ క్షమాపణ ఆర్థిస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘార్‌ జిల్లాలో రూ.76,000 కోట్లతో నిర్మించే వాద్వాన్‌ ఓడరేవు ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శుక్రవారం పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. 

మనం పాటించే విలువలను చాలా భిన్నమైనవని పేర్కొన్నారు. దైవంలాంటి ఛత్రపతి శివాజీ కంటే మనకు ఇంకేదీ గొప్ప కాదని స్పష్టంచేశారు. పదేళ్ల క్రితం బీజేపీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తన పేరు ఖరారు కాగానే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ను సందర్శించానని, శివాజీ సమాధి వద్ద ధ్యానం చేశానని మోదీ గుర్తుచేసుకున్నారు. మరాఠా వీరుడు వీర సావర్కార్‌ను కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారని, అవమానిస్తున్నారని ఆరోపించారు. వారు ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరని విమర్శించారు.  

పదేళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపు  
‘అభివృద్ధి చెందిన భారత్‌’ అనే మన లక్ష్య సాధనలో ‘అభివృద్ధి చెందిన మహారాష్ట్ర’ ఒక కీలక భాగమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రగతి కోసం గత పదేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహారాష్ట్ర శక్తిసామర్థ్యాలు, సంపదతో రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా ప్రయోజనం పొందాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

 మత్స్యకారుల సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పూర్తి అంకితభావం, నిజాయితీతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చేపల పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా వేలాది మంది మహిళల సాధికారతకు చేయూత అందించామని వివరించారు. 

చేపల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా రికార్డుకెక్కిందని హర్షం వ్యక్తం చేశారు. 2014లో మన దేశంలో చేపల ఉత్పత్తి కేవలం 8 మిలియన్‌ టన్నులుగా ఉందని, ఇప్పుడు 17 మిలియన్‌ టన్నులకు చేరిందని వెల్లడించారు. పదేళ్లలో ఉత్పత్తి రెట్టింపు అయ్యిందన్నారు. రూ.76,000 కోట్లతో వాద్వాన్‌ పోర్టు నిర్మిస్తున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద కంటైనర్‌ పోర్టు అవుతుందని చెప్పారు. అభివృద్ధి దిశగా భారతదేశ ప్రయాణంలో ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని మోదీ వ్యాఖ్యానించారు. రూ.1,560 కోట్లతో నిర్మించే 218 ఫిషరీస్‌ ప్రాజెక్టులకు సైతం ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.360 కోట్లతో రూపొందించిన వెస్సెల్‌ కమ్యూనికేషన్, సపోర్టు సిస్టమ్‌ ప్రారంభించారు. బానిసత్వపు సంకెళ్లు తెంచుకున్న ‘నూతన భారత్‌’కు దేశ శక్తిసామర్థ్యాలు ఏమిటో పూర్తిగా తెలుసని స్పష్టంచేశారు.   


 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)