Breaking News

‘సింధూర్‌’ సమయంలో ప్రధాని మోదీ ఏం చేశారంటే..

Published on Wed, 06/04/2025 - 16:00

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్‌ జరిపిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ ‘ఆపరేషన్‌ సింధూర్‌(Operation Sindhur)’ పేరిట ‍ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ వైమానిక దాడులను ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా పర్యవేక్షించారని, ఉగ్రవాదాన్ని తిప్పికొట్టే విషయంలో ఆయనకున్న సంకల్పాన్ని ఈ దాడులు మరింత బలోపేతం చేశాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

మే ఏడున భారత సైన్యం పా​క్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై దాడులు చేసిందని, జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నదని సింగ్ తెలిపారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన ఇతర వ్యాపకాలను పక్కనపెట్టి, పరిస్థితులను అనుక్షణం పర్యవేక్షించారన్నారు. ప్రశాంతత అలవాటైన ఆయనకు ఆందోళన అంటే ఏమిటో తెలియదని తాను అనుకున్నానని సింగ్‌ అన్నారు. గతంలో ప్రధాని రాత్రివేళల్లో కూడా పని చేశారని, అయితే ఇప్పుడు తాను చూసినది ప్రత్యేకమైనదని సింగ్‌ తెలిపారు.

పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రధాని రక్షణ దళాలకు అక్కడున్న పరిస్థితులు, వారి విచక్షణ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చారన్నారు. ఇటువంటిది గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎంతో స్పష్టతతో నిర్ణయం తీసుకున్నారని, పౌరులకు హాని కలిగించకుండా, ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాద వనరులను అణిచివేయాలని  సూచించారన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి  అనంతరం భారత్‌ ఎంతో సంయమనంతో  ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, దాడులు చేసిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ‘సిందూర్’లో తునాతునకలైన పాక్‌ యుద్జ విమానాలివే..

Videos

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)