5న ప్రధాని మోదీ కుంభస్నానం

Published on Tue, 02/04/2025 - 09:45

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించనున్నారు. అనంతరం పవిత్ర తివేణీ సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. బుధవారం, మాఘ మాసం అష్టమి తిథి నాడు ‍ప్రధాని మోదీ పవిత్ర స్నానం చేయనున్నారు. తరువాత త్రివేణీ సంగమం ఒడ్డున గంగామాతను పూజించి, దేశప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు మహాకుంభ్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అనంతరం అరయిల్ ఘాట్ నుండి పడవ ద్వారా సంగమ ప్రాంతానికి వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు గంటసేపు ఉంటారు. కాగా 2024 డిసెంబర్ 13న ప్రధాని సంగమం ఒడ్డున గంగా నదికి హారతినిచ్చి, పూజలు నిర్వహించి, కుంభమేళా విజయవంతం కావాలని ప్రార్థించారు. బుధవారం కుంభమేళాకు వస్తున్న ప్రధాని మోదీ అక్కడ అఖాడాలను కలుసుకోనున్నారు.

2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అర్థ కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగి, సామాజిక సామరస్య సందేశాన్ని అందించారు. ప్రధాని నుంచి అటువంటి గౌరవాన్ని పొందిన ఐదుగురు సిబ్బందికి నోటమాటరాలేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇతర పారిశుధ్య కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ కూడా దీనిని తన జీవితంలో అత్యంత మరపురాని క్షణంగా అభివర్ణించారు.

మోడీ కుంభమేళ షెడ్యూల్



ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో భేటీ?

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)